Headlines
KTR pays homage to Manda Jagannath

మందా జగన్నాథం పార్థివదేహానికి కేటీఆర్ నివాళ్లు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం పార్థివ దేహాన్నిసందర్శించి నివాళులర్పించారు. ముందుగా మందా పార్థివదేహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

image
image

కాగా, మాజీ ఎంపీ మందా జగన్నాథం గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన ఆయన నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. 1996లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పార్టీలో చేరి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసి తొలిసారిగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా (లోక్‌సభ) ఎన్నికయ్యారు.

1996 – 11వ లోక్‌సభకు (టిడిపి) ఎన్నికయ్యారు.
1999 – 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం) (TDP)
2004 – 14వ లోక్‌సభకు (3వసారి) తిరిగి ఎన్నికయ్యారు (TDP)
2009 – 15వ లోక్‌సభకు (4వ పర్యాయం) తిరిగి ఎన్నికయ్యారు (కాంగ్రెస్)
2014 – TRS పార్టీ నుండి పోటీ చేసి కార్ గుర్తు లో పోలిక ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి వల్ల సల్ప మెజారిటీతో ఓడిపోయారు. 2018 ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినేట్ హోదాలో నామినేట్ చేయబడింది. (9 జూన్ 2018 – 8 జూన్ 2019) ఆ తరువాత మరొక్కసారి రెన్యూవల్ చేయబడి రెండవసారి కూడా చేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Indoor digital tv antenna hdtv hd aerial. Advantages of overseas domestic helper. Icomaker.