భోగి మంటలతో పాటు బంగారం ధరలు కూడా మండుతున్నాయి. భోగి, సంక్రాంతి పండగల సమయంలో పసిడి షాపింగ్ ప్రియులకు షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే నిన్నటితో పోల్చితే బంగారం ధరలు సుమారు రూ.500 పెరిగాయి. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు సుమారు రూ.1500 మేర పెరగటం గమనార్హం. ఒక విధంగా చూస్తే గత ఏడాదికంటే ధరలు మరింత పెరిగాయి. కొత్త ఏడాదిలో అయినా బంగారం ధరల్లో రిలీఫ్ దొరుకుతుందని భావించిన సామాన్యులకు మాత్రం కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. దీనికి తోడు జ్యువెలరీ షాపులు కూడా పండగ సీజన్లో కొనుగోళ్లు ఆశించగా ఫలితం లేకుండా పోయింది.
మరోవైపు బంగారంకి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి శుభకార్యాలు అలాగే పెళ్లిళ్ల సమయంలో తప్పనిసరి కనీస మొత్తంలోనైనా కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే బంగారం ధరలు పెరగటానికి అనేక కారణాలు చెప్పవచ్చు. బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది అలాగే 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. అయితే 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు & విదేశీ మారకపు ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధర చూస్తే: 10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.73,400, నిన్నటి ధర చూస్తే రూ.73,000 దింతో ఇవాళ రూ.400 పెరిగింది.