అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. ప్రాణనష్టం సైతం పెరుగుతున్నది. శనివారం రాత్రికి మృతుల సంఖ్య 16కు పెరిగినట్టు అధికారులు తెలిపారు.
పాలిసేడ్స్, ఏటన్, కెన్నెత్, హర్ట్‌లో దాదాపు 62 చదరపు మైళ్ల మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పని చేస్తున్నాయి. కాగా, లాస్ ఏంజెల్స్‌లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కమలా హారిస్ ఇంటికీ ముప్పు
కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం పాలిసేడ్స్ అగ్ని బ్రెంట్‌వుడ్ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు పలువురు క్రీడాకారులు, నటీనటుల ఇండ్లు ఉన్నాయి. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో చేయాల్సిన తన చివరి విదేశీ పర్యటనను కమలా హారిస్ రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్, ఓక్లహోమా, మరికొన్ని రాష్ర్టాలను మంచు తుఫాను అతలాకుతలం చేస్తున్నది.