1984లో, భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వేడుక స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రాలను గుర్తు చేస్తూ యువతకు ప్రేరణగా నిలుస్తుంది. స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం లేదా రాష్ట్రీయ యువ దివస్ ఘనంగా నిర్వహించబడుతుంది. ఆయన భారతదేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా యువతకు అద్భుతమైన మార్గనిర్దేశం చేసిన తత్వబోధనలు, ఈ వేడుక ప్రధానాంశాలుగా నిలుస్తాయి.
స్వామి వివేకానంద ఆలోచనలు యువతను ప్రభావితం చేసిన మహోన్నత దివ్య తత్వశాస్త్రాల శిఖరగ్రంగా నిలిచాయి. ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1984లో నిర్ణయించింది. ఆయన జీవితవిధానం, ఉపన్యాసాల ద్వారా యువతకు ప్రేరణ ఇవ్వడం, సమాజంలో మార్పులు తీసుకురావడం ముఖ్య ఉద్దేశ్యాలుగా ఉన్నాయి. ఈ దినోత్సవం యువతను మాత్రమే కాకుండా, సమాజంలో సమూల మార్పు తేవడానికి ప్రేరణ కలిగించే ఒక కార్యక్రమంగా నిలుస్తుంది.
యువత తమ ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని, సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించడానికి ప్రేరణ పొందుతారు. స్వామి వివేకానంద బోధనల ద్వారా విద్య ప్రాముఖ్యతను స్మరించుకోవడం జరుగుతుంది. యువత సామాజిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ రోజు రుజువు చేస్తుంది. విభిన్న సమాజాల మధ్య ఐక్యత, సహకారం నెరపడానికి ఈ వేడుకలు దోహదం చేస్తాయి. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి, యువతలో నూతన ఆవిష్కరణలకు ప్రేరణ కలిగించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. జనవరి 12న రామకృష్ణ మిషన్ కేంద్రాల్లో, వివిధ మఠాల్లో సాంప్రదాయ వేడుకలు జరుగుతాయి. ఇందులో మంగళ ఆర్తి, భక్తి గీతాలు, ధ్యానం, ప్రసంగాలు నిర్వహించబడతాయి.
రక్తదాన శిబిరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వామి వివేకానంద బోధనల పారాయణాలు, వ్యాస రచన, ప్రసంగ పోటీలు, సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు ఇతర ప్రముఖ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామి వివేకానంద ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన ప్రసంగాలు, ముఖ్యంగా 1893లో చికాగోలో “సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా”తో ప్రారంభమైన ప్రసంగం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది. ఈ వేడుకలు యువతలో చైతన్యం నింపి, సమాజానికి మార్గనిర్దేశకులుగా నిలబెడతాయి.