సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ‘సంక్రాంతికి వస్తున్నాం‘ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా గ్రాండ్‌గా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్నది.
ఈ క్రమంలో ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర అదనంగా రూ.125 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ. 100 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సినిమా రిలీజయ్యే ఈ నెల 14న 6 షోల నిర్వహణకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు అదనపు ధరల వసూలుకు పర్మిషన్ ఇచ్చింది.