ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బరేలీలో జరినగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2024, ఫిబ్రవరి ఏడవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పాస్ చేసిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మడి పౌర స్మృతి అమలు కానున్నది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బరేలీలో జరినగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 29వ ఉత్తరయాని మేళాను సీఎం ధామి ప్రారంభించారు. 2024, ఫిబ్రవరి ఏడవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వెంటనే దక్కింది. ఆ తర్వాత మార్చి 12, 2024లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని రూపొందించారు. జనవరి 2025 నుంచి ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్లు చెప్పారు. యూసీసీ అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ డెవలప్ చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు.