తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇంటి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ తో సహా హాజరు కానున్నారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను విచారించిన ఏసీబీ వారి నుంచి సేకరిం చిన సమాచారం మేరకు కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. అయితే, కేటీఆర్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఏసీబీ ఎదుట కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయానికి చేరుకు న్నారు. విచారణ తరువాత కేటీఆర్ అరెస్ట్ అవుతారా.. లేక, విచారించి పంపిస్తారా అనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్, పురపాలక శాఖ మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగిన కమ్యూనికేషన్ వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించారు.
జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు సమాచారం
విచారణ వేళ ఈ కేసులో ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థకు చెందిన చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు నాటి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్టు చేయాల్సి వస్తే బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు అలెర్ట్ వచ్చినట్లు సమాచారం. ఇటు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కీలక నేతలు కొందరిని గృహ నిర్బంధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏసీబీ ఆఫీసు వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో అటువైపు వెళ్లే రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేస్తున్నారు. అరెస్ట్ తప్పదా ఇక, విచారణ వేళ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.