Headlines
ktr and revanth reddy

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణలో రోజురోజుకు రాజకీయాల వేడిని పుటిస్తున్నది. బిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య మాటలు, కేసులు, కోర్టుల గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతిష్టాత్మక ఫార్ములా ఈని ఎంతో కష్టపడి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రభుత్వం తనపై మోపిన ఫార్ములా ఈ కార్ రేసు అక్రమ కేసు అంశంలో బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు ఇవాళ(గురువారం) కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమనే ఫార్ములా ఈ కార్ రేసును ఓ గొప్ప ఎజెండాతో ముందుకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు.


తెలంగాణ మొబిలిటీ వ్యాలీ‌లో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ- మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Clear cut e mailer solutions. Warehouse.