సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు చిన్నపాటి పాత్రలతో కెరీర్ ప్రారంభించి,ఆపై స్టార్స్‌గా ఎదిగారు.కొంతమంది టీవీ సీరియల్స్ లేదా యాంకర్‌గా పని చేసి, హీరోయిన్లుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి.అలాంటి వారి కోవలో చేరింది రెజీనా కసాండ్రా. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన రెజీనా తన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ప్రముఖ నటి అవతారం ఎత్తి మెప్పిస్తోంది.1990 డిసెంబర్ 13న చెన్నైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన రెజీనా, ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.ఈ మార్పుకు సంబంధించిన ఆసక్తికర కారణాలను ఆమె తాజాగా వెల్లడించారు, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కెరీర్‌ను తొమ్మిదేళ్ల వయసులోనే రెజీనా ప్రారంభించింది. చిన్నారుల టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా ఆమె తన సహజమైన మాటలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 14వ ఏట, తమిళ చిత్రం కంద నాల్ ముదల్ లో నటనకు అవకాశం దక్కింది. ఆ సినిమాలో ఆమె లైలా చెల్లెలు పాత్రలో ఆకట్టుకుంది.
2012లో తెలుగులో వచ్చిన శివ మనసులో శ్రుతి సినిమాతో రెజీనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోని తన నటనకు ఆమె SIIMA ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. ఈ విజయం తర్వాత రెజీనా తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన నటనను నిరూపించుకుంది.తమిళంలో పెద్దగా విజయాలు సాధించకపోయినా, తెలుగులో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది.2019లో హిందీలో ఏక్ లడ్కీ కో దేఖా తో అయిసా లగా*తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.ఈ ప్రయాణం ఆమె ప్రతిభకు నిదర్శనం. రెజీనా తన జీవితంలో జరిగిన ఓ ముఖ్యమైన మార్పును ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె మత మార్పు వెనుక ఆసక్తికర కథనం ఉంది. రెజీనా తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్.వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 6 ఏళ్ల వరకు రెజీనా ముస్లిం పిల్లగా పెరిగింది.