Sabarimala temple to be opened today

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

తిరువనంతపురం: నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు గంటలకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే సంప్రదాయ బద్ధంగా పూజలు ప్రారంభమవుతాయి. ఈరోజు నుంచి తిరిగి శబరిమల ఆలయం తెరుచుకోనుండటంతో జ్యోతి దర్శనానికి మాలలు వేసుకునే అయ్యప్పలతో పాటు సాధారణ భక్తులు కూడా శబరిమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అదే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆలయ అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రికార్డు స్థాయిలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు. లక్షల సంఖ్యలో చేరుకున్నా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. మహిళ భక్తులకు కూడా ప్రత్యేక గదులను ఏర్పాటు చేసిన బోర్డు మళ్లీ రద్దీ పెరిగే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే రావాలని అధికారులు తెలిపారు.

మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న అంటే గత గురువారం ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు నవంబర్ 16న ప్రారంభమయ్యాయి. దీంతో తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. మండల పూజల సందర్భంగా శబరిమలలో మొత్తం 32 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మకరవిళక్కు పూజల కోసం శబరిమల ఆలయం ఈరోజు తెరుచుకోనుంది. జనవరి 14న మకరవిళక్కు పూజ, మకరజ్యోతి దర్శనం నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Clear cut e mailer solutions. Warehouse.