PepsiCo India Revolutionary Awards

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్

వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్న మహిళలను ప్రశంసించే విలక్షణమైన వేదిక రివల్యూషనరి అవార్డ్స్, పెప్సికో ఇండియా వారిచే ప్రారంభించబడింది.

హైదరాబాద్‌: తెలంగాణ నుండి గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్ (SHG) పెప్సీకో ఇండియా వారి ప్రారంభపు రివల్యూషనరి అవార్డ్స్ 2024లో ఎకనామిక్ ఎంపవర్మెంట్ త్రూ SHGల శ్రేణిలో విజేతగా నిలిచింది. గణపతి సెల్ఫ్–హెల్ప్ గ్రూప్ ఆర్థిక స్వతంత్రత, తట్టుకునే సామర్థ్యం, మరియు లింగ-చేరిక గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా సుమారు 10,000 మంది మహిళల జీవితాలను సానుకూలంగా మార్చింది.

తమ పురోగతి భాగస్వామ సిద్ధాంతంతో ప్రేరేపించబడిన పెప్సికో ఇండియా న్యూఢిల్లీలో రివల్యూషనరి కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్స్ 2024ను ప్రారంభించడం ద్వారా వ్యవసాయంలో మహిళలను సమర్థవంతులను చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. వ్యవసాయ రంగంలో మార్పును ప్రోత్సహిస్తున్న సాటిలేని మహిళల తోడ్పాటును ఈ కార్యక్రమం గుర్తించింది. తమ ప్రేరేపిత నాయకత్వం మరియు వినూత్నత కోస, రంగానికి అర్థవతమైన తోడ్పాటును ప్రోత్సహిస్తున్నందుకు భారతదేశంవ్యాప్తంగా పదిమంది మహిళా రైతులు మరియు సమూహాలు గుర్తించబడ్డాయి. ఈ రంగంలోని నిపుణులతో కూడిన ప్రొఫెసర్. రమేష్ చాంద్, సభ్యుడు, నీతీ ఆయోగ్ అధ్యక్షతవహించిన బయటి జ్యూరీ ద్వారా నామినేషన్లను బాగా పరిశీలించిన తరువాత వీరు ఎంపికయ్యారు.

విజేతలకు బహుమతులు అందచేస్తున్న వారిలో ముఖ్య అతిథి డాక్టర్. రాజ్ భూషణ్ చౌదరి, గౌరవనీయులైన జల్ శక్తి శాఖ సహాయ మంత్రి, భారత ప్రభుత్వం; ముఖ్య అతిథి శ్రీమతి. స్మృతి ఇరానీ, మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖ మాజీ మంత్రి; ముఖ్య వక్త శ్రీ. అజిత్ బాలాజీ జోషి, సెక్రటరి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమం, పంజాబ్ ప్రభుత్వం భాగంగా ఉన్నారు.

గణపతి SHG గురించి మరిన్ని వివరాలు..

నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పదిమంది దృఢ సంకల్పం కలిగిన మహిళలచే 1.13 ఎకరాల లీజు భూమిలో సమీకృత వ్యవసాయం ద్వారా స్వావలంబన మరియు ఆర్థిక స్వాతత్ర్యం సాధించాలని కలతో గణపతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ 2002లో స్థాపించబడింది. స్థానిక సమాజాల కోసం సేంద్రీయ కూరగాయలు, చేపలు, కోళ్లు, గొర్రెల పెంపకం పైన దృష్టి సారించిన పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించబడిన ఈ సంస్థ ఇప్పుడు దిల్వార్ పూర్, ఖానాపూర్, మరియు సారంగపూర్ వంటి మండలాలకు తమ ప్రభావాన్ని విస్తరించింది. గ్రూప్ కమ్యూనిటీ మద్దతును, వైవిధ్యతను, స్వావలంబన, ఆర్థిక సవాళ్లను అధిగమించడం, తమ సభ్యులకు మరియు పొరుగున ఉన్న సమూహాలను సమర్థత కలిగించడానికి ప్రాధాన్యతనిచ్చింది.

సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను వినియోగించడం ద్వారా మరియు చిన్న కమతాల యొక్క లాభాలను అధికం చేయడం ద్వారా, గ్రామీణ భారతదేశంలో సహకార వృద్ధి మరియు మహిళల ఆర్థిక సాధికారత కోసం వారు ప్రమాణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి విధాన రూపకర్తలు, అభిప్రాయ నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్త, కార్పొరేట్స్, మరియు విద్యావేత్తలు సహా 150కి పైగా వ్యవసాయ రంగ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వ్యవసాయంలో మహిళలను సమర్థవంతం చేయడంలో, ప్రశంశించడంలో గణనీయమైన మైలురాయికి గుర్తుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Care archives explore the captivating portfolio. Aufbau des uneedpi towers in einer metaverse umgebung, der unternehmen und projekten im pi network als hub dient. ”“i believe that the president is probably rewarding him for being such a loyal soldier to the president,” he said.