Allu Arjun's Chief Bouncer Arrest

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌..

సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామాలు వస్తున్నాయి.అల్లు అర్జున్‌తో సంబంధం ఉన్న బౌన్సర్‌ ఆంటోని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఈ ఆంటోని అల్లు అర్జున్ ఫ్యామిలీకి పనిచేసే బౌన్సర్‌గా వుండి, ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనా స్థానానికి సంబంధించి కీలక పాత్ర పోషించాడు.డిసెంబర్ 4న జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో బౌన్సర్ ఆంటోని ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.తాజాగా,చిక్కడపల్లి పోలీసులు ఆంటోనిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని పేర్కొనడంతో, ఈ కేసు మరింత ఉత్కంఠ పెంచింది.

పోలీసులు ఆంటోనితో పాటు ఇతర బౌన్సర్లను కూడా విచారించేందుకు సిద్ధంగా ఉన్నారు.వారితో పాటు,సీన్ చేపట్టనున్నారు.సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా,అదే రోజు థియేటర్‌లో జరిగే పరిస్థితులను అర్థం చేసుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు.ఈ ఘటనలో అల్లు అర్జున్ కుటుంబం ఎక్కడ ,తొక్కిసలాట ఎలా ఏర్పడింది? ఆ సమయంలో బౌన్సర్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే లక్ష్యంగా రీకన్స్ట్రక్షన్ కార్యక్రమం నిర్వహిస్తారు.ఇంతలో,ఈ ఘటనపై 18 మందిపై కేసుల నమోదయ్యాయని అధికారులుతెలిపారు.ఇప్పటికే,అల్లుఅర్జున్‌ను మూడున్నర గంటలపాటు విచారించిన పోలీసులు,ఆయన నుంచి సమాధానాలు సేకరించారు.అవసరమైతే, మరోసారి విచారణకు రావాలని పోలీసులు సూచించారు.ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా సహకరిస్తానని తెలిపారు.తర్వాత,4న సంధ్య థియేటర్ వద్ద గేట్ తెరవడం వల్ల వచ్చిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం కలకలం రేపింది.ఆ ఘటన కారణంగా,పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి.ఈ విచారించాల్సిన అంశాలన్నింటి మధ్య,పరిస్థితి ఎలా మారిందో మరింత స్పష్టత రావాల్సి ఉంది.ప్రస్తుతం,ఈ కేసు మరియు సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయి, ఇకపై ఏ పరిణామాలు ఉంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

At home shirt care. Innovative pi network lösungen. A foster care advocate is challenging rep.