dead body home delivery case

పార్శిల్‌లో డెడ్‌బాడీ అసలు హంతకుడు అతడే!

పశ్చిమ గోదావరి జిల్లాను వణికించిన చెక్కపెట్టెలో శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు పరిష్కారమైంది.ఆస్తిపై కన్నేసిన మరిది తన వదినను బ్లాక్‌మెయిల్ చేయాలనే కుట్రలో భాగంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు.అయితే, ఆ ప్లాన్‌ అడ్డం తిరగడంతో పరారయ్యాడు.ఈ సంఘటనలో సంబంధంలేని ఓ నిరుపేద కూలి ఈ కుట్రకు బలయ్యాడు.భీమవరం, డిసెంబర్ 24: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చెక్కపెట్టెలో గుర్తుతెలియని మృతదేహం కనిపించిన ఘటన పెద్ద సంచలనం సృష్టించింది.పోలీసులు ఈ మృతదేహాన్ని కాళ్ల గ్రామానికి చెందిన బర్రె పర్లయ్య (45) గా అనుమానిస్తున్నారు.అయితే, డీఎన్‌ఏ టెస్ట్ తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించనున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరుమాని శ్రీధర్‌వర్మ గురించి విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.మృతుడైన పర్లయ్యకు, శ్రీధర్‌వర్మకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.కేవలం పనిమీద పిలిపించి,అతనిని దారుణంగా హతమార్చి తన క్రూరప్లాన్‌కు వాడుకోవాలని నిందితుడు యోచించాడు.గత గురువారం సాయంత్రం చెక్కపెట్టెలో శవం బట్వాడా చేసిన ఘటనలో, అదే రోజు బర్రె పర్లయ్య శ్రీధర్‌వర్మ ఇంటి వద్ద కనిపించాడనే విషయం ఆలస్యంగా బయటపడింది. ఇది విచారణలో కీలకమైన లీడుగా మారింది.

బర్రె పర్లయ్య కుటుంబ సమస్యల కారణంగా భార్య, ఇద్దరు పిల్లలతో దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించేవాడు.ఒకప్పుడు లారీ డ్రైవర్‌గా పని చేసిన పర్లయ్య, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడితో మద్యం అలవాటుకు బానిసయ్యాడు.రోజూ కూలి పనులు చేస్తూ గాంధీనగరంలో జీవనం సాగించేవాడు.రాత్రి కూలి పనులవాళ్ల ఇంటి వద్ద లేదా పర్లమ్మ ఆలయం వద్ద నిద్రించేవాడు.పర్లయ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన శ్రీధర్‌వర్మ,అతన్ని పనికి పిలిపించి హతమార్చాడు.తన ఆస్తి వివాదాల్లో వదినను బ్లాక్‌మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ హత్య చేశాడు.అయితే, అతని ప్లాన్ అసలు పాన్‌కి వచ్చినట్టుగా వెళ్లలేదు,దీంతో అతను పరారయ్యాడు.పోలీసులు శ్రీధర్‌వర్మపై ప్రధాన అనుమానితుడిగా కేసు నమోదు చేసి, పర్లయ్య హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Só limitar o tempo de tela usado por crianças não evita prejuízos; entenda – jornal estado de minas. Die technische speicherung oder der zugriff, der ausschließlich zu statistischen zwecken erfolgt. Redactor de contenido archives negocios digitales rentables.