rajinikanth

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సూపర్ స్టార్..

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కెరీర్‌లో మరొక మైలురాయిని చేరుకోడానికి సిద్ధమవుతున్నారు.ఇటీవల విడుదలైన “జైలర్” సినిమా భారీ విజయాన్ని సాధించింది.నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రజనీ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది.“జైలర్” విజయానికి తర్వాత, రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు.గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుపుకుంటోంది.ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సందీప్ కిషన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా యాక్షన్‌, క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో సాగే కథనంతో రూపొందుతుంది.ఈ చిత్రాన్ని 2025 మేలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం.ఇప్పటికే “జైలర్” సృష్టించిన సంచలనం తరువాత, దాని సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.నెల్సన్ తన సోషల్ మీడియా ద్వారా “జైలర్ 2”ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.

రజనీ 171వ చిత్రంగా పరిగణించే ఈ సినిమా కోసం మరోసారి సన్ పిక్చర్స్‌తో కలిసి నెల్సన్ పనిచేస్తున్నారు.“జైలర్” చిత్రంలో రజనీకాంత్ తన పవర్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను మైమరపించారు.ఈ చిత్రంలో రమ్యకృష్ణ,వినాయక్, తమన్నా, యోగి బాబు వంటి ప్రముఖ తారాగణం నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేసింది. తమన్నా ప్రత్యేక గీతంలో రజనీ సరసన డ్యాన్స్ చేసి ప్రేక్షకుల నుండి విశేషంగా ఆదరణ పొందింది. రజనీకాంత్ కెరీర్‌లో “జైలర్ 2” మరో కీలక ఘట్టం కానుంది. ఇప్పటికే కూలీ సినిమా యూనిట్ శరవేగంగా పని చేస్తుండగా,“జైలర్ 2”పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్ వరుసగా తన సినిమాలతో బాక్సాఫీస్‌ను దహించేస్తూ, ఫ్యాన్స్‌కి పండుగ వాతావరణం తీసుకువస్తున్నారు.“జైలర్ 2” రజనీ మ్యాజిక్‌ను మరోసారి చూపనుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో నెలకొంది.2025, 2026 రజనీ ఇయర్స్ అని చెప్పడంలో సందేహమే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore the captivating portfolio. Innovative pi network lösungen. Hurricane milton tears across florida global reports.