షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్

షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్

షేక్ హసీనా ని తిరిగి పంపించాలని: భారతదేశానికి బంగ్లాదేశ్ తాజా లేఖ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5 నుండి భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఆమె బంగ్లాదేశ్ లో తన 16 సంవత్సరాల పాలనను నిరసనల కారణంగా పోగొట్టుకున్న ఆమె, ఇక అప్పటి నుండి భారత్ లో నివసిస్తున్నారు. ఇప్పుడు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారతదేశానికి ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించాలని లేఖ పంపింది.

“న్యాయ ప్రక్రియ కోసం షేక్ హసీనా ను బంగ్లాదేశ్ తీసుకురావాలని భారత ప్రభుత్వానికి మేము లేఖ పంపించామని” బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు.

“ఢాకా మరియు న్యూఢిల్లీ మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉంది మరియు ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపాలి.” అని తాత్కాలిక ప్రభుత్వ హోం సలహాదారు జహంగీర్ ఆలం కూడా పేర్కొన్నారు.

షేక్ హసీనాను వెనక్కి పంపండి: బంగ్లాదేశ్

గత నెలలో, తాత్కాలిక ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, “మేము ప్రతి హత్యకు న్యాయం జరగాలనే దిశగా చర్య తీసుకుంటాం. పడిపోయిన నిరంకుశ షేక్ హసీనాను వెనక్కి పంపమని భారతదేశం నుండి కూడా మేము కోరుకుంటున్నాం” అని చెప్పారు.

ఆగస్టు 8న అధికారంలోకి వచ్చిన యూనస్, హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో సుమారు 1,500 మంది మరణించి, 19,931 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.

అక్టోబరులో, బంగ్లాదేశ్ లా అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్, “భారతదేశం హసీనా అప్పగింతను తిరస్కరించేందుకు ప్రయత్నిస్తే, బంగ్లాదేశ్ తీవ్రంగా నిరసిస్తుందని” చెప్పారు.

సెప్టెంబరులో, యూనస్ ఢాకాలో పిటిఐతో చేసిన ఇంటర్వ్యూలో, “హసీనా భారతదేశం నుండి రాజకీయ వ్యాఖ్యలు చేయడం స్నేహరహిత సంజ్ఞ” అని అన్నారు. “భారతదేశం ఆమెను ఉంచాలని అనుకుంటే, ఆమె మౌనంగా ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.

యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై హసీనా స్పందిస్తూ, ప్రభుత్వం “మారణహోమం”కు పాల్పడిందని మరియు తనను తొలగించినప్పటి నుండి మైనారిటీలను, ముఖ్యంగా హిందువులను రక్షించడంలో విఫలమైందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

T shirt archives explore the captivating portfolio. Innovative pi network lösungen. Defense attorney andrew baldwin told jurors allen is innocent.