vinod

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది.
అనారోగ్య పరిస్థితితో కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ గతం ఇటీవల థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అవసరమైన వైద్యపరీక్షలు చేసినప్పటికీ ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 52 ఏళ్ల కాంబ్లి ఇటీవల మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన చిన్ననాటి మిత్రుడు, లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఇటీవల రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్‌లో కాంబ్లి కలుసుకున్నారు. రిహాబిలేషన్‌ సెంటర్‌కు వెళ్లేందుకు తాను సిద్ధమేనని, అక్కడికి వెళ్లేందుకు తనకెలాంటి భయం లేదని, తన కుటుంబం కూడా తనతోనే ఉందని ఇటీవల వెల్లడించారు.
సచిన్ తో స్నేహం గొప్పది
జడేజా తనకు మంచి మిత్రుడని, ఇటీవల తనకు చూడడానికి కూడా వచ్చాడని, ‘కమాన్ గెటప్’ అంటూ తనను ఉత్సాహపరిచాడని కాంబ్లి గుర్తుచేసుకున్నారు. ఆలస్యంగానైనా చాలా మంది ఇప్పుడు తనను చూడడానికి వస్తున్నారని చెప్పారు. సచిన్ తనకు ఎప్పుడూ ఏమీ చేయలేదని అనుకునేవాడినని, అయితే తనకు గతంలో రెండు సర్జరీలు జరిగినప్పుడు మెడికల్ బిల్స్ ఆయనే చెల్లించారని, తమ స్నేహం ఎప్పటిలాగే ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుంబ్లే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Clocks archives explore the captivating portfolio. Uneedpi ist ihr schlüssel zur zukunft des pi network. Hurricane milton tears across florida.