krt

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు: కేటీఆర్‌

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు అని కేటీఆర్‌ అన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని తెలిపారు.
పీవీకి సముచితస్థానం ఇచ్చిన బీఆర్ఎస్
రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని చెప్పారు. అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. వారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి అని ఎక్స్‌ వేదిగా ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

At home shirt care. Warum diese projekte wichtig sind jedes uneedpi projekt trägt dazu bei, das potenzial des pi network zu entfalten. Defense attorney andrew baldwin told jurors allen is innocent.