earthquake

ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా భూప్ర‌కంప‌న‌లు రావ‌డం ఇది వ‌రుస‌గా మూడో రోజు. శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు.
స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ నుంచి భయంతో పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.
ఈరోజు భూమి కంపించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌ట్లేద‌ని స్థానికులు వాపోతున్నారు. మరింత భూప్ర‌కంప‌న‌లు రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The perfect combination of luxury by marcu ioachim golden roses make for a luxurious and indulgent gift combination. Innovative pi network lösungen. The police response, greene said on social media.