shasanamandali

శాసన మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం

హైదరాబాద్ : శాసన మండలి సమావేశాల్లో శనివారం నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో స్పెషల్ మెన్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. దీంతో సభ్యులు స్పెషల్ మెన్షన్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శాసన సభలో ఆమోదం పొందిన మూడు బిల్లులను మండలి ఆమోదం కోసం మండలిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభారర్ ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి తరపున మంత్రి శ్రీధర్ బాబు జీహెచ్ఎంసీ 2024 సవరణ బిల్లును. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు సవరణ 2024ను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. భూభారతి బిల్లును రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం సభ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని 80 గ్రామ పంచాయితీలను మున్సి పాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ నవరణ మేరకు పంచాయితీ రాజ్ చట్టం పె డ్యూల్ 8 లోని 140 పంచాయితీల సవరణకు వీలు పడేలా పంచాయితీరాజ్ బిల్లును ప్రభుత్వం తీసుకు వచ్చింది. జీహెచ్ఎంసీ వరిధిని విస్తరించేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు కూడా శనివారం మండలి ఆమోదం లభించింది. 51 గ్రామాల విలీనంపై పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ సభకు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ వేశామని… దాని వల్ల భవిష్యత్ లో రిజర్వేషన్ల అమలు ఇబ్బంది ఉండదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో లో 42 శాతం రిజర్వేష స్లు బీసీలకు కేటాయిస్తమని చెప్పామన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా జిత్ నా అబాధి ఉత్న ఇస్తారి ప్రస్తుతం సుప్రీం కోర్టు నిబంధనల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పాడు. సామాజిక అంశాల విషయంలో రాజకీయ పార్టీలు న హకరించాలని.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది దీనిద్వారా ఎవరెంతో వారికంత సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. పేదవారికి అన్యాయం జరగకుండా అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే హైరా చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్ లో అలాంటి పరిస్థితి రాకుండా స్థానికులు ఆక్రమణకు గురైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం నిబంధనలు ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని సవరణ బిల్లును పెడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభ్యుల చర్చ అనంతరం మూడు బిల్లులను ఆమోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Durability archives explore the captivating portfolio. Innovative pi network lösungen. Hurricane milton tears across florida.