భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత పొందిన మహా కుంభమేళా వచ్చే ఏడాది జనవరి 13న ప్రారంభమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా భక్తులకి, సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది.గంగ, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రంలో స్నానం చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. 2025లో జరగనున్న మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై, మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ఈ ఉత్సవం ముగుస్తుంది.ఈ కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరుగుతాయి. ప్రతి రాజ స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.ముఖ్యంగా, నాల్గవ రాజ స్నానం వసంత పంచమి రోజున నిర్వహించబడుతుంది, ఇది కళ, విజ్ఞానం,సంగీతానికి దైవంగా భావించే సరస్వతి దేవికి అంకితం చేస్తారు.మహా కుంభమేళా రాజస్నానాలు జనవరి 13న పుష్య పౌర్ణమితో మొదలవుతాయి. ప్రతి రాజస్నానం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుతుంది.
వసంత పంచమి రోజున, అంటే ఫిబ్రవరి 3, నాల్గవ రాజ స్నానం నిర్వహించబడుతుంది. ఈ స్నానం హిందూ మతంలో ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరుగుతుంది.2025 వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాల్గవ రాజ స్నానం కోసం ప్రత్యేకమైన శుభ ముహూర్తం నిర్ణయించబడింది శుభ సమయం సాయంత్రం 5:23 గంటలకు ప్రారంభమై, 6:16 గంటలకు ముగుస్తుంది.బ్రహ్మ ముహూర్తంలో రాజస్నానం చేయడం అత్యంత శ్రేయస్కరం. గంగానదిలో త్రివేణి సంగమ క్షేత్రంలో స్నానం చేయడం పాపపరిహారకరమని,ధార్మిక ఫలితాలను అందిస్తుందని నమ్మకం. వసంత పంచమి రోజున రాజ స్నానం చేయడం వల్ల భక్తులు ఆధ్యాత్మిక శుభఫలితాలను పొందుతారు. ఈ సమయంలో స్నానం చేసి, పూజలు చేసి, దానాలు చేయడం ద్వారా ప్రత్యేకమైన పుణ్యాన్ని పొందుతారు. మహా కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉంటుంది.