chess record

వేగంగా కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ చెస్ లో విశ్వ రికార్డు నెలకొల్పాడు. లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అతని ప్రతిభను గుర్తించింది.9 ఏళ్ల దేవాన్ష్, “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్” గా 175 పజిల్స్ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ విజయానికి గుర్తుగా ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చింది.నారా దేవాన్ష్ తన వ్యూహాత్మక ఆలోచన, తేలికపాటి ప్రదర్శనతో “చెక్‌మేట్ మారథాన్“అనే టాస్క్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు.5334 సమస్యలను పరిష్కరించడంలో తన ప్రతిభను కనబరిచాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చిన దేవాన్ష్, 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు.ఈ రికార్డు సాధనకు తల్లిదండ్రుల సహకారం, కోచ్ మార్గదర్శకం కీలకంగా మారాయి.దేవాన్ష్ కృషి, పట్టుదలతోనే ఈ విజయాన్ని సాధించగలిగాడు.

ఆయన సాధించిన ఈ రికార్డులు, భారతీయ పిల్లల ప్రతిభను వెలుగులోకి తెస్తున్నాయి.సరైన మార్గదర్శకత్వం ఉంటే మన పిల్లలు ప్రపంచాన్ని కీర్తి పతాకం కురిపించగలుగుతారనడానికి దేవాన్ష్ ఉదాహరణ.తండ్రి నారా లోకేష్ తనయుడి విజయం పై ఆనందం వ్యక్తం చేస్తూ,”దేవాన్ష్ లక్ష్యంపై సుస్థిరమైన దృష్టితో శిక్షణ పొందాడు.అతను గ్లోబల్ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల నుండి ప్రేరణ పొందాడు.ఈ విజయానికి గౌరవార్థంగా రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు” అని అన్నారు.దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి కూడా ఈ విజయంపై స్పందిస్తూ,”దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే డైనమిక్ విద్యార్థి.ఆయన అద్భుతమైన మానసిక చురుకుదనం తో 175 పజిల్స్ ని ఆసక్తితో పరిష్కరించారు. ఈ విజయాన్ని ఆయన ప్రయాణంలో ఒక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను” అని చెప్పారు. దేవాన్ష్ ప్రదర్శన కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా, భారతీయ యువతకు శక్తివంతమైన సందేశం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Febrefobia : entenda o medo dos pais sobre mudança de temperatura da criança – jornal estado de minas. Die technische speicherung oder der zugriff, der ausschließlich zu anonymen statistischen zwecken verwendet wird. Negocios digitales rentables negocios por internet.