T20

ఈ ఏడాది టీ20ఐలో తోపులు వీళ్లే..

2024 సంవత్సరం ముగింపుకు చేరుకోవడంతో, క్రికెట్ ప్రపంచం ఈ ఏడాది చేసిన అద్భుత ప్రదర్శనలను తలుచుకుంటోంది.భారత జట్టు ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో అదిరిపోయే ఆటతీరుతో ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా, బౌలర్లు తమ సత్తా చాటి ఎన్నో విజయాలకు మద్దతుగా నిలిచారు.ఈ సంవత్సరం అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో ముగ్గురు ప్రత్యేకంగా రాణించారు.ఇప్పుడు వారి ప్రదర్శనను ఒక్కసారి పరిశీలిద్దాం.2024 టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అక్షర్ పటేల్ తన బౌలింగ్‌తో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.ఈ గుజరాతీ ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను చాటాడు.మొత్తం 16 టీ20 మ్యాచుల్లో అతడు ఆడిన అక్షర్, 22 వికెట్లను పడగొట్టి భారత జట్టుకు ఎంతో మద్దతుగా నిలిచాడు.టర్నింగ్ ట్రాక్స్‌లో అతని స్పిన్‌తో ప్రతిపక్ష బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.2024 టీ20 క్రికెట్‌లో అతడు భారత్ తరఫున మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ 2024లో టీ20 ఫార్మాట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ఈ మణికట్టు స్పిన్నర్ తన అనుభవాన్ని మ్యాచ్‌ల్లో మెరుగ్గా వినియోగించుకుని టీమిండియా విజయాలకు కీలకంగా మారాడు.

యుజ్వేంద్ర చాహల్ స్థానాన్ని పూరిస్తూ,బిష్ణోయ్ 16 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 22 వికెట్లను సాధించాడు. అతని చురుకైన బౌలింగ్ ప్రతిపక్ష బ్యాటర్లను ఇబ్బందుల్లో పెట్టింది.బిష్ణోయ్ విజయం అతనికే కాక, భారత స్పిన్ బ్యాకప్‌కు కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చింది.అర్షదీప్ సింగ్ గురించి చెప్పుకోవడం మరిచిపోవడం అసాధ్యం. అతని యార్కర్లు, డెత్ ఓవర్లలో మెరుగైన కంట్రోల్ టీమిండియాకు విజయాల బాటలో సహాయపడింది. ఈ సంవత్సరం అతని ప్రదర్శన భారత పేస్ దళానికి భరోసా ఇస్తూ నిలిచింది.2024 సంవత్సరం టీమిండియా టీ20 బౌలర్లకు గొప్పగా నిలిచింది.ప్రతి బౌలర్ తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.ప్రపంచకప్ గెలిచిన టీమిండియా విజయాల్లో బౌలర్ల పాత్ర అనన్యసమానమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pemuda katolik komda kepri gelar seminar ai, membangun masa depan dengan teknologi canggih. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Latest sport news.