నరేంద్ర మోడీకి కువైట్ ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ గౌరవం
ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ అనేది కువైట్ యొక్క నైట్ హుడ్ ఆర్డర్. ఇది స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ సార్వభౌమాధికారులు మరియు విదేశీ రాజకుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.
ఇది గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్ మరియు జార్జ్ బుష్ వంటి విదేశీ నాయకులకు లభించింది. గత నెల, ప్రధాని మోదీ గయానా దేశ పర్యటన సందర్భంగా గయానా అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’తో సత్కరించారు.
“గయానా అత్యున్నత పురస్కారాన్ని నాకు ప్రదానం చేసినందుకు నా స్నేహితుడు అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సంబంధాల పట్ల మీ లోతైన నిబద్ధతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం, ఇది ప్రతి రంగంలో ముందుకు సాగడానికి మాకు స్ఫూర్తినిస్తుంది, ”అని ప్రధాని మోదీ అన్నారు.
మోదీకి కువైట్ అత్యున్నత గౌరవం
ప్రధాన మంత్రికి డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ “డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్” కూడా అందించారు. “డొమినికా అత్యున్నత జాతీయ పురస్కారంతో సత్కరించడం విశేషం. నేను దీనిని 140 కోట్ల మంది భారతదేశంలోని ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
గల్ఫ్ దేశానిలో పర్యటన సందర్భంగా ప్రధానికి ఘనమైన స్వాగతం లభించింది. కువైట్‌లోని బయాన్ ప్యాలెస్‌లో ఆయనకు సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఈ వేడుకలో కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబా కూడా ఉన్నారు.