Headlines
game changer

రామ్ చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుండగా, మరెందరో ప్రముఖ నటీనటులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. జనవరి 10, 2024న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపే విధంగా రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ లీడ్ రోల్ పోషించగా, శంకర్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, అల్లు శిరీష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఈ అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని విధంగా, గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ నగరంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లు ఇండియాలోనే జరుగుతాయి కానీ, ఈసారి మేకర్స్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. డిసెంబర్ 21,ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, అలాగే ఈవెంట్ హోస్ట్ సుమ ఇప్పటికే డల్లాస్‌కు చేరుకున్నారు. వీరితో పాటు రామ్ చరణ్ తదుపరి సినిమాల డైరెక్టర్లు బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. డల్లాస్‌లోని రామ్ చరణ్ అభిమానులు తమ స్టార్‌కు అదిరిపోయే స్వాగతం అందించడమే కాదు, ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Diamond mailer clear cut e mailer solutions. Warehouse.