cyber crime

పోలీస్ కే టోకరా ఇచ్చిన సైబర్ నేరగాళ్లు..!

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంతో చురుగ్గా తమ పని ప్రారంభిస్తున్నారు.డిజిటల్ అరెస్టుల పేరుతో నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ, ఫేక్ లింకులు పంపి, అనేకమంది నుండి డబ్బు దోచుకుంటున్నారు.ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు తమ ఆచరణలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.ఈ నేపథ్యంలో బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని ముఖ్యమైన సూచనలు అందించారు.విజయవాడకు చెందిన ఓ సీఐ సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్‌కు గురయ్యారు. రెండు రోజుల క్రితం ముంబైలో రోడ్డు ప్రమాదం జరిగిందని, ఒక వ్యక్తి మరణించాడని, ముంబై పోలీసులు తనపై కేసు పెట్టారని చెప్పి బెదిరించారు.అంతేకాక, “డిజిటల్ అరెస్ట్” పేరుతో డబ్బు డిమాండ్ చేశారు.ఈ ఘటన డిసెంబరు 19న జరిగింది. విజయవాడకు చెందిన సీఐ కొంత పని మీద ముంబై వెళ్లి హోటల్‌లో ఉంటూ,అక్కడ తన ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలు ఇచ్చారు.ఆ తర్వాత విజయవాడకు తిరిగి వచ్చిన తర్వాత తన ఫోన్‌కు వచ్చిన బెదిరింపు కాల్‌కు మొదట కంగుతిన్నారు.

కానీ ఆ సీఐ తన అనుభవంతో నేరగాళ్లను గుర్తించి, ప్రశ్నల వర్షం కురిపించి వారిని బెదరగొట్టారు. ఈ ఘటన మరోసారి సైబర్ భద్రతపై మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గుర్తు చేస్తోంది.ముఖ్యంగా హోటళ్లలో సెక్యూరిటీ కారణాల కోసం ఆధార్ కార్డు వంటి కీలక డాక్యుమెంట్స్‌ను ఇవ్వాల్సి వస్తే, మాస్క్ ఆధార్‌ను వినియోగించడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.మాస్క్ ఆధార్‌లో 12 అంకెల్లో చివరి నాలుగు మాత్రమే కనిపిస్తాయి,మిగిలిన వాటిని “XXXX”తో సూచిస్తారు.ఇలాంటి మాస్క్ ఆధార్ వాడటం ద్వారా ఫైసింగ్ వంటి మోసాలను తగ్గించవచ్చు.అలాగే, ఇతర ప్రాంతాల్లో హోటల్‌లో ఉంటే,బ్యాంకింగ్ లేదా ఆధార్ నెంబర్‌కు సంబంధంలేని ఫోన్ నెంబర్లను ఇవ్వడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం చాలా తేలిక. కానీ మీ జాగ్రత్తలు, అప్రమత్తత మీ డేటాను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menyikapi persoalan rempang, bp batam ajak masyarakat agar tetap tenang. “the most rewarding aspect of building a diy generator is seeing the. India vs west indies 2023 archives | swiftsportx.