తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటోంది.సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.ప్రత్యేకించి తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన తమన్నా, ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టి, అక్కడ బిజీ హీరోయిన్‌గా మారింది.తమన్నా నటనా ప్రయాణం 2005లో హిందీ చిత్రంతో ప్రారంభమైంది.‘చంత్సా రోషన్ షెహ్రా’అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె, తెలుగులో మంచు మనోజ్ సరసన నటించిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే, ఆమెకు అసలైన గుర్తింపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ తో వచ్చింది.
ఈ సినిమా ఆమె కెరీర్‌ను ఒక కొత్త దిశగా మలిచింది. తమన్నా తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ప్రతి స్టార్ హీరోతో కలిసి పనిచేసింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి వంటి టాప్ హీరోల సరసన ఈ అందాల తార తన ప్రతిభను నిరూపించుకుంది. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా,స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది.‘బాహుబలి’ లో అవంతిక పాత్రతో తమన్నా పాన్-ఇండియన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో ఆమెకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తమన్నా ఇటీవలే చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో కనిపించింది.అయితే, ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది.తమిళంలో విడుదలైన ‘అరకన్’వంటి సినిమాలు మాత్రం మంచి విజయాలను అందించాయి. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నాతో పాటు రాశి ఖన్నా, యోగి బాబు, కోవై సరళ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.