హైదరాబాద్: కిమ్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి. అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను 100 రోబోటిక్-సహాయక విప్పల్ తోటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశంలో మొదటి ప్రైవేట్ హాస్పిట్‌లాగా పేరొందినదిగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కిమ్స్ నిర్వహించిన 100 రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో 14 నుంచి 80 ఏళ్ళు వయసు కలిగినవారు అధికమన్నారు. వీరంతా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలకు చెందినవారన్నారు.
డాక్టర్ మధు దేవరశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్, హైదరాబాద్ వారు ఈ 100 రోబోటిక్ శస్త్రచికిత్సల మైలురాయిని సాధించిన వైద్య బృందానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులలో ముఖ్య సమస్యలు అధిగమించుటకు, త్వరితంగా కోలుకోవటానికి తాము శస్త్రచికిత్సల కోసం రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. దీనివలన చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత ఐదవ రోజున డిశ్చార్జ్ అయ్యి త్వరలో వారి సాధారణ జీవితాలను గడిపే అవకాశం కలిగింది అన్నారు.