rain

ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో జనజీవనం అస్తవ్యస్తమైనది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్లు ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారం తెలియజేశారు. దీని ప్రభావం వలన మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. కళింగపట్నం విశాఖపట్నం పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

విశాఖ జిల్లాలో 387. 6 మిల్లీమీటర్ల వర్షం పాతం

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలకు ఇళ్లు, చెట్లు నేలకూలుతున్నాయి. 24 గంటల్లో విశాఖ జిల్లాలో 387. 6 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదయింది.
విశాఖ జిల్లాలోని అనంతపురంలో 47. 8 మిల్లీమీటర్లు, పెదగంట్యాడలో 42. 6, ములగాడలో 39. 4, భీమిలిలో 39. 2, గాజువాకలో 36. 4, పద్మనాభంలో 35. 6, మహారాణి పేటలో 35. 2, విశాఖ గ్రామీణ ప్రాంతంలో 32. 6, పెందుర్తి 27. 8, గోపాలపట్నంలో 26. 8, సీతమ్మదారుల 24.2 మీటర్ల వర్షపాతం నమోదయింది.
ఇదిలా ఉండగా అల్పపీడన ప్రభావం వలన విశాఖలోని సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. పెద్ద ఎత్తున కెరటాలు ఒడ్డుకు చేరడంతో శుక్రవారం గోకుల్ పార్కు వద్ద ఉన్న బీచ్ రక్షణ గోడ చాలా వరకు దెబ్బతింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thank you for choosing to stay connected with talkitup news chat. Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе.