ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్
హైదరాబాద్ :
బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బంధువుల పార్టీగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని,దాడులకు పాల్పడాలని పథకం రచిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, లగచర్ల ఘటన లాగా మరో సారి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కుట్ర లకు మేము భయపడేది లేదని, దొంగే దొంగ అన్నట్లు గా కేటీఆర్ తీరు ఉందని విమర్శించారు.బావ కళ్లలో ఆనందం కోసం హరీష్ రావు అసెంబ్లీ లో అడ్డగోలుగా వ్యవహారిస్తున్నాడని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను ఏ 1 గా ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యాక అసెంబ్లీ లో చర్చ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ధరణి పైన చర్చ జరిగితే తమ భూఆక్రమాలు బయట పడుతాయనే చర్చను అడ్డుకుంటున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు.