BR Naidu tirumala

తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం – టీటీడీ ఛైర్మన్

తిరుమలలో భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తిరుమల రాజకీయ వేదిక కాదు. కొండపై ఎవరైనా రాజకీయ ప్రస్థావనలు చేస్తే దానిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

తిరుమల పవిత్రతను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యత అని, అది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారకూడదని ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణకు చెందిన నేత తిరుమల కొండపై చేసిన రాజకీయ వ్యాఖ్యల విషయంలో టీటీడీ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన అన్నారు.

ఇక తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల ప్రతి భక్తుడికి సమానమైన సేవలందిస్తుందని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీ సేవల విషయంలో ప్రాంతీయ వివక్ష అంటూ ఉండదని ఆయన ఖండించారు. తిరుమలలో భక్తుల కోసం ఏర్పాట్లు, సేవలు, నియమాలు ఖచ్చితంగా పాటించాలనే ఉద్దేశ్యంతోనే నిర్వహణ సాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కొండపై ప్రశాంత వాతావరణాన్ని కాపాడటమే తమ బాధ్యత అని, ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను మసకబార్చేలా మారవద్దని కోరారు. ఈ పరిణామంతో తిరుమల కొండపై రాజకీయ ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని భక్తులు పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయం కాకుండా ఆధ్యాత్మికతే ముఖ్యమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Urgent search underway : motorist flees after causing downtown kingston crash and traffic light breakage. Following in the footsteps of james anderson, broad became only the second englishman to achieve 400 test wickets. The head оf thе agency, phіlірре lаzzаrіnі, told the un thаt іf the bills.