Eating dates in winter is g

చలికాలంలో ‘ఖర్జూర’ తింటే ఆరోగ్యానికి మేలు

చలికాలంలో శరీరానికి తగినంత వెచ్చదనంతో పాటు తక్షణ శక్తి అవసరం. ఈ సమయాల్లో ఖర్జూరం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఖర్జూరంలో ఉన్న గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఎంతో కీలకంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను నిలుపుకోగలిగే శక్తి వస్తుంది.

ఖర్జూరం మంచి ఫైబర్‌తో నిండిపోయి ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్యలలో ఒకటి కీళ్ల నొప్పులు. ఖర్జూరంలో పుష్కలంగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం కీళ్లలో స్టిఫ్నెస్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి.

చలికాలం అనేది జబ్బుల సంభవానికి మార్గం చూపే కాలం. ఈ కాలంలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ను పెంచుకోవడం అత్యంత అవసరం. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్, కెరటెనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. శరీరానికి తగినంత వేడి అందించే ఆహార పదార్థాలలో ఖర్జూరం ముందు వరుసలో ఉంటుంది. రోజూ ఒక దోసె పాలు లేదా నెయ్యితో కలిపి ఖర్జూరం తింటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. ఈ చిట్కా చిన్నవారికి, వయోవరుద్ధులకు చాలా మంచిది. అందుకే చలికాలంలో ఖర్జూరాన్ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా శరీరానికి తగినంత శక్తి కూడా లభిస్తుంది. ఖర్జూరం సహజంగా లభించే ఆహార పదార్థం కావడంతో దానిని తరచుగా తీసుకోవడం ద్వారా శీతాకాలంలో శరీరం తేలికగా మారే సమస్యలను అడ్డుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Mere $500 admission fee escalated into a violent encounter that shook the community to its core. Latest sport news. The head оf thе agency, phіlірре lаzzаrіnі, told the un thаt іf the bills.