A case has been registered against KTR

కేటీఆర్‌పై కేసు నమోదు

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్ర‌యివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచార‌ణ జ‌రిపేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఇటీవ‌ల అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో త‌దుప‌రి చ‌ర్యల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ ఉప‌క్ర‌మించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై అభియోగం మోపారు. కేటీఆర్‌పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.

ద‌మ్ముంటే అసెంబ్లీలో చ‌ర్చ పెట్టాలి: కేటీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే ఫార్ములా – ఈ రేస్‌పై అసెంబ్లీలో చ‌ర్చ పెట్టాల‌ని కేటీఆర్ కాసేప‌టి క్రితం అసెంబ్లీ లాబీలో డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెట్టే ద‌మ్ము లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి క‌దా..? చర్చ నాలుగు గోడల మధ్య‌ కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు అని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. Cost analysis : is the easy diy power plan worth it ?. Latest sport news.