hydra అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

అల్కాపురిలో అక్రమ షట్టర్లపై హైడ్రా పంజా

హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, అల్కాపురిలోని కొన్ని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది. ‘మార్నింగ్ రాగా’ అపార్ట్ మెంట్ లో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన షట్టర్లను (దుకాణాలను) హైడ్రా నేడు తొలగించింది. ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వున్న కట్టడాలను కూల్చివేస్తున సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్ట్ హైడ్రా కూల్చివేతపై నిబంధనలు పాటించాలని పెర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Ground incursion in the israel hamas war. Lankan t20 league.