ప్రస్తుతం తెలుగు ఓటీటీల్లో వస్తున్న కంటెంట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలోనే, హరి కథ అనే వెబ్ సిరీస్ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ పోషించిన పాత్ర మరియు ట్రైలర్‌లో కనిపించే ఆధ్యాత్మిక టచ్ ప్రేక్షకులను ఆసక్తిగా మారుస్తోంది. కానీ ఈ సిరీస్ కథ, దాని కథన శైలి ఏమిటి? ఇందులో అసలు మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఈ కథ అరకు మరియు దాని చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుంది. 80, 90 దశకాల నాటి నేపథ్యంలో, ఎస్సై విరాట్ (శ్రీరామ్) తన భార్యను ఓ ప్రమాదంలో కోల్పోతాడు.మరణానికొద్దిరోజులే ఉందని తెలిసిన విరాట్, తన కూతురికి మంచి కుటుంబాన్ని పరిచయం చేయాలనుకుంటాడు.ఈ ప్రయత్నంలోనే అరకు ప్రాంతానికి చేరతాడు,ఎస్సై భరత్ (బిగ్ బాస్ అర్జున్) వద్దకు వెళ్తాడు.
అయితే ఆ ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి.ఆ హత్యల వెనుక స్వయంగా దేవుడే ఉన్నాడని గ్రామస్తులందరూ నమ్ముతారు.అదే సమయంలో ఎస్సై భరత్ కూడా మరణిస్తాడు.విరాట్ తన స్నేహితుడి మరణం వెనుక అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడే రంగాచారి (రాజేంద్ర ప్రసాద్) వేషాలు, చామంతి (దివి), జర్నలిస్ట్ లీసా (పూజిత పొన్నాడ), వైదేహీ (శ్రియా కొట్టం) పాత్రలు కథనంలో కీలక మలుపులు తీసుకొస్తాయి.అసలు ఈ హత్యల వెనుక ఏం నిజం ఉంది? వాటి వెనుక దేవుడి పాత్ర నిజమేనా? హరి కథ ఓ సాంఘిక ప్రశ్నలను కలిగించే ప్రయత్నం చేస్తుంది.పుట్టుక మన చేతుల్లో ఉండదనే విషయం, అలాంటి పుట్టుక కారణంగా వివక్ష ఎదుర్కోవడం,అంటరానితనం వంటి అంశాలను ఈ సిరీస్ ప్రస్తావించింది.అప్పుడు అణగారిన వర్గాల పరిస్థితులు, నేటికీ జరుగుతున్న ఆడవారిపై అఘాయిత్యాల వంటి సమస్యలు బలంగా చూపించబడ్డాయి.ఇక కథలో హత్యలు రామాయణం,పురాణాల అవతారాలతో లింక్ చేస్తూ,అర్థవంతమైన సన్నివేశాలను దర్శకుడు పరిచయం చేశాడు. హత్యల వెనుక ఉన్న వ్యక్తులు, ఆ దేవుడి అవతారాల వెనక ఉన్న అసలు ఆలోచన ప్రేక్షకులను అంచనాలకు దూరం చేస్తాయి.