సహజీవనంపై కేంద్ర మంత్రి నితిన గడ్కరీ సంచల కామెంట్ చేశారు. అది తప్పుడు విధానమన్నారు. సమాజానికి వ్యతిరేకం అన్నారు. యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సహజీవనం సంస్కృతి మనది కాదని, ఇది విదేశీ విధానమని, అంతేకాదు ఇది తప్పుడు విధానమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇది సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు.
స్వలింగ సంపర్కుల వివాహాలు మంచిది కాదు
స్వలింగ సంపర్కుల వివాహాలతో.. సామాజిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో అతి పెద్ద సమస్య సహజీవనమే అని, పెళ్లిని వ్యతిరేకించడం పెద్ద సమస్యగా మారినట్లు ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ వెళ్లినప్పుడు అక్కడ తమకు తెలిసిందన్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే, అప్పుడు మీరెలా పిల్లల్ని కంటారని గడ్కరీ అడిగారు. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల భవిష్యత్తు ఏంటి ఆయన ప్రశ్నించారు. సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తే, అది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నించినట్లు తెలిపారు.
సమాజం తనంతటే తాను నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ దేశంలో లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ 1500 మంది మహిళలు, 1000 మంది పురుషులు ఉంటే, అప్పుడు ఇద్దరు భార్యలకు పురుషుల అర్హులని ఆయన అన్నారు. ఆదర్శ భారత దేశంలో విడాకుల్ని బ్యాన్ చేయాలన్న దాన్ని ఆయన ఖండించారు. సహజీవనం మంచిది కాదన్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను వ్యతిరేకిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.