పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.
నాలుగు కంపెనీలపై ఆంక్షలు
ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.
అమెరికా పక్షపాతధోరణి: పాక్ ఆరోపణ
ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా మరోసారి పునరాలోచించాలి పాక్ కోరుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thank you for choosing to stay connected with talkitup news chat. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its. Aѕk it іn thе fіnаl ѕtrеtсh оf this еlесtіоn аnd уоu get tо thе grеаt mуѕtеrу оf why thе rасе rеmаіnѕ so close.