ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ, 43వ సిఆర్డీఏ అధారిటీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అలాగే రూ. 8821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లే అవుట్‌లలో వేసే రోడ్లపై క్యాబినెట్‌లో చర్చిస్తారు. ఎల్‌పీఎస్ రోడ్లకు రూ. 3807 కోట్లు, ట్రంకు రోడ్లకు రూ. 4521 కోట్లు, బంగ్లాలకు(జడ్జిలు, మంత్రులు) రేూ. 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతరవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలో మీటర్లు రోడ్లు లేఅవుట్‌లకు అనుమతి ఇస్తూ అథారిటీ నిర్ణయంపై క్యాబినెట్‌లో చర్చ జరగనుంది.
అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి 55 మీటర్లు ఎత్తుతో 20. 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణం.. వాటితో పాటు అమరావతిలో బిల్డింగ్‌ల నిర్మాణానికి రూ. 6465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్‌లలో మౌళిక వసతులకు రూ. 9699 కోట్లు, ట్రంక్ రోడ్లకు రూ. 7794 కోట్లు, ఎస్టీపీ వర్కులకు రూ.318 కోట్లు మంజూరుకు మంత్రి మండలిలో చర్చ జరగనుంది.
అమరావతిలో ఐకానిక్ భవనల నిర్మాణం కొనసాగింపుకు మంత్రిమండలిలో చర్చ జరగనున్నట్లు సమాచారం. జిఏడి టవర్ బేస్మెంట్ +39 ఆఫీసు ప్లోర్లు+ టెర్రస్ ప్లోర్లు 17 లక్షల 03 వేల 433 చదరపు అడుగుల నిర్మాణానికి క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. హెడ్ వోడి టవర్స్ 1, 2 కుI బేస్మెంట్ +39 ప్లోర్స్ + టెర్రస్ నిర్మాణం ద్వారా 28 లక్షల 41 వేల 675 చదరపు అడుగులు నిర్మాణానికి మంత్రిమండలిలో చర్చ జరుగుతుంది.
పిడిఎస్ బియ్యంపై చర్చకు అవకాశం
కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న ఓడలో పిడిఎస్ బియ్యం ఉన్నట్టు గుర్తించడంతో ఆ వ్యవహరం పైనా క్యాబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు పరిశ్రమలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు.