brs mla green

అసెంబ్లీకి ఆకుపచ్చ కండువాలతో బీఆర్‌ఎస్‌ సభ్యులు

తెలంగాణ అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో హాజరయ్యారు. రైతు సమస్యలపై మండలి, శాసన సభలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్‌ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలి. రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్‌ చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు ఆకుపచ్చ కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు.
కాగా, బీఆర్ఎస్ నేతలు రోజుకో సమస్యతో శాసనసభకు వస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ల వస్త్రధారణలో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్‌తో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మంగళవారం బేడీలు ధరించి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం యిచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Valley of dry bones. Latest sport news.