vaccine research cancer cell

త్వరలో క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌

ప్రాణాంతక క్యాన్సర్‌ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్నది. క్యాన్సర్‌కు త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నది. క్యాన్సర్‌కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా చేసిన ప్రకటన క్యాన్సర్‌ చికిత్సలో విప్లవాత్మకంగా మారే అవకాశం ఉన్నది. తమ దేశంలోని పలు పరిశోధన సంస్థలు కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్‌ వెల్లడించింది.

cancer
cancer

వచ్చే ఏడాది నుంచి ఉచితంగా!
వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్‌ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే రేడియాలజీ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ జనరల్‌ డైరెక్టర్‌ ఆండ్రే కాప్రిన్‌ తెలిపారు. క్యాన్సర్‌ కణాలను గుర్తించి, అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ సిద్ధం చేస్తుంది. క్యాన్సర్‌ కణతుల అభివృద్ధిని, రోగ సంబంధ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పని చేస్తున్నట్టు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని గమలేయ నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సైతం తాము క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ తయారీకి చాలా చేరువలో ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ పేరు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. రష్యాలో క్యాన్సర్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్నేండ్లుగా వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. 2022లో రష్యాలో 6,35,000 క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయి.
ప్రజలకు ఇదో వరం
కాగా క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపట్ల రోగులు హర్షం ప్రకటిస్తున్నారు. నిజంగా ఇది వారి ప్రాణాలకు ఓ వరంగా చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Plt bupati suharsi igirisa dukung pjs penuhi syarat jadi konstituen dewan pers. Cost analysis : is the easy diy power plan worth it ?. India vs west indies 2023 archives | swiftsportx.