హైరదాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి. లగచర్ల రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎడ్లబండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక అటు అసెంబ్లీకి ఆకు పచ్చ కండువాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని అసెంబ్లీలోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా , బోనస్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.