ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని అధికారులు వెల్లడించారు. బోటులో సరిపడా లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, నీల్కమల్ ఫెర్రీ సిబ్బంది , పర్యాటకులు వాటిని ధరించకపోవడం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రమాదం జరిగే ముందు రక్షణ చర్యలు నిర్వహించడంలో ఘోరమైన లోపాలు చోటుచేసుకున్నాయి. బోటు సిబ్బంది రక్షణ నియమాలను పాటించకపోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. పర్యాటకులకు సరైన మార్గనిర్దేశం చేయకపోవడం, భద్రతాపరమైన చర్యలపై నిఘా లేకపోవడం ఈ ప్రమాదానికి దారితీసిన ప్రధాన అంశాలుగా చెబుతున్నారు.
బోటు మునుగుతున్న సమయంలో JNPT పైలట్ బోట్ వెంటనే చేరుకొని లైఫ్ జాకెట్లు అందించడం వల్ల మరింత మంది ప్రాణాలను కాపాడగలిగారు. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు లేకపోతే ఈ ఘటన మరింత పెద్ద విషాదంగా మారేదని అధికారులు తెలిపారు. సరైన సమయానికి రక్షణ చర్యలు చేపట్టడంతో కొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం తరువాత భద్రతా చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నౌకా ప్రయాణాల్లో రక్షణ చర్యలపై సరైన అవగాహన కల్పించడంతో పాటు, నియమాలు పాటించడం తప్పనిసరి చేస్తే ఇలాంటి ఘటనలు రాకుండా ఉంటాయన్నారు. పర్యాటకులకు ముందు జాగ్రత్త చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ దుర్ఘటన ద్వారా నౌకా సేవల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను ప్రకటించింది.