స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెడతాడని ప్రచారం నెట్టింట జోరుగా జరుగుతోంది.త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నాడని, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి, “జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలానే అల్లు అర్జున్ కూడా సీఎం అవుతాడు.100 శాతం అతను కొత్త పొలిటికల్ పార్టీని స్థాపిస్తాడు,” అంటూ ధీమాగా చెప్పాడు. అతని మాటలు ఇప్పుడంతా నెట్టింట చర్చకు దారితీసాయి. వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విభిన్న స్పందనలు వస్తున్నాయి.బన్నీ అభిమానులు ఇందులో కొంత ఆసక్తి చూపుతుండగా, మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు.”జ్యోతిష్యుడి మాటల్ని తేలిగ్గా తీసుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే, వేణు స్వామి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో విస్తారంగాపంచుకుంటున్నారు.
అల్లు అర్జున్ టీమ్ క్లారిటీ వేణు స్వామి వ్యాఖ్యలతో సంబంధం లేకుండా, అల్లు అర్జున్ టీమ్ ఈ రూమర్లను గట్టిగా ఖండించింది.కొద్దిరోజుల క్రితమే బన్నీ టీమ్ ట్విట్టర్ ద్వారా “రాజకీయాల్లోకి ఎలాంటి ఎంట్రీ లేదు” అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.అల్లు అర్జున్ ఇప్పటివరకు తన సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టాడు. రీసెంట్‌గా “పుష్ప 2” చిత్రానికి సంబంధించి బిజీగా ఉండటంతో పాటు, తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. కానీ అభిమానులు మాత్రం బన్నీ ఏ నిర్ణయం తీసుకున్నా వెనుక ఉన్నారు. పుష్ప 2 హిట్ తర్వాత బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌లు, అప్‌డేట్‌లు అందరికీ ఆసక్తికరంగా మారాయి.