NIACL అసిస్టెంట్ 2024

NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024: 500 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) 500 అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ అవకాశానికి ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 17, 2024 నుంచి జనవరి 1, 2025 లోగా అధికారిక వెబ్‌సైట్ newindia.co.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ప్రాథమిక సమాచారం:

  • మొత్తం ఖాళీలు: 500
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 17, 2024
  • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 1, 2025

వయస్సు(01/12/2024 నాటికి):

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • 02/12/1994 ముందు పుట్టకూడదు మరియు 01/12/2003 తర్వాత పుట్టకూడదు.

విద్యార్హత (01/12/2024 నాటికి):

  • అభ్యర్థి కనీసం ఏదైనా డిసిప్లైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • రాష్ట్ర ప్రాంతీయ భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటం వంటి పరిజ్ఞానం అవసరం.

జీతం:
రూ. 22,405 నుండి రూ. 62,265 వరకు ఉంటుంది

NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024కి దరఖాస్తు చేసే విధానం

  1. NIACL అధికారిక వెబ్‌సైట్ newindia.co.in కు వెళ్లండి.
  2. Recruitment విభాగాన్ని క్లిక్ చేయండి.
  3. CLICK HERE FOR NEW REGISTRATION ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  4. ఒకే సెషన్‌లో దరఖాస్తు పూర్తి చేయలేకపోతే SAVE AND NEXT ట్యాబ్ ఉపయోగించండి.
  5. FINAL SUBMIT బటన్ నొక్కే ముందు దరఖాస్తులోని వివరాలను సమీక్షించుకోండి.
  6. మీ సమాచారాన్ని ధృవీకరించడానికి VALIDATE YOUR DETAILS బటన్‌ను నొక్కండి.
  7. మీ ఫోటో మరియు సంతకాన్ని నిబంధనల ప్రకారం అప్‌లోడ్ చేయండి.
  8. దరఖాస్తు సమర్పించే ముందు Preview ట్యాబ్ ద్వారా మొత్తం ఫారమ్‌ను సమీక్షించుకోండి.
  9. అవసరమైన వివరాలను సవరించుకొని FINAL SUBMIT బటన్ నొక్కి దరఖాస్తును పూర్తిచేయండి.
  10. తరువాత, PAYMENT ట్యాబ్ ద్వారా ఫీజు చెల్లించండి.

దరఖాస్తు ఫీజు:

  • SC/ST/PwBD/EXS అభ్యర్థులు: ₹100
  • ఇతర అభ్యర్థులు: ₹850

పరీక్ష తేదీలు:

  • టియర్ I (ప్రాథమిక పరీక్ష): జనవరి 27, 2025
  • టియర్ II (ప్రధాన పరీక్ష): మార్చి 2, 2025

ఎంపిక ప్రక్రియ:

NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ ఎంపికలో ఈ దశలు ఉంటాయి:

  1. ప్రాథమిక పరీక్ష (Preliminary examination): ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకి ఒక గంట వ్యవధి ఇస్తారు. ఇంగ్లీష్, రీసోనింగ్ మరియి న్యూమరికల్ ఎబిలిటీ విభాగాలను కలిగి ఉంటుంది.
  2. ప్రధాన పరీక్ష (Main Exam): మెయిన్ పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. దీనికి 2 గంటల వ్యవధి ఇస్తారు. ఇంగ్లీష్, రీసోనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ కనౌలెడ్జి మరియి జనరల్ అవేర్నెస్ విభాగాలు ఉంటాయి.
  3. ప్రాంతీయ భాషా పరీక్ష (ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే)

ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ (ఆన్‌లైన్):

SC / ST / OBC (నాన్-క్రీమీ లేయర్) / PwBD అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటే, ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ వివరాన్ని సూచించాలి.

అధికారిక వెబ్‌సైట్‌ newindia.co.in ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kejar pertumbuhan ekonomi 8 persen, bp batam prioritaskan pengembangan kawasan strategis. Com – gaza news. Stuart broad archives | swiftsportx.