Election

జమిలి బిల్లుపై జేపీసీ బాధ్యతలు ఏమిటి?

దేశ వ్యాపితంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన జమిలి బిల్ ను జేపీసీకి పంపిన విషయం తెలిసేందే. నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్ ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రతిపాదిత ‘129 సవరణ చట్టం-బిల్లు’, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. అయితే, జేపీసీని ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ కమిటీ ఏం చేస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ఎంపీల సంఖ్య ఆధారంగా..
పార్లమెంట్‌లో ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ్యులను కమిటీలోకి తీసుకుంటారు. రాజ్యసభ సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగివున్న పార్టీకి కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీకి దక్కనుంది.
కమిటీ కాల వ్యవధి 90 రోజులు
జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ కమిటీ కాల వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత గడువును పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరో 48 గంటల్లోనే జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారంతో (డిసెంబర్ 20) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిపోనున్నాయి.
జేపీసీ బాధ్యతలు
కమిటీలో భాగంగా లేని ఎంపీలు, మాజీ జడ్జిలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు ‘విస్తృత సంప్రదింపులు’ జరుపుతారు. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలన చేసి క్లాజులవారీగా లోక్‌సభకు నివేదికను సమర్పించనుంది. మూడవసారి బీజేపీ గెలవడంతో జమిలిపై పట్టుదలతో వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gelar rapat paripurna, ini 10 rancangan randerda inisiatif dprd kota batam. Cost analysis : is the easy diy power plan worth it ?. Latest sport news.