election commission of india

త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన?

త్వరలో ఢిల్లీ ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నది.
వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలపై సన్నాహక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ వారంలోనే ఎన్నికల నిర్వహణపై అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. సమావేశం అయిన వెంటనే ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌
ఇక ఈ ఎన్నికల కోసం అధికార ఆప్‌ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్‌ ఖరారు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా ముఖ్యమంత్రి అతిశీ గతంలో పోటీ చేసిన కల్కాజీ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తమ పార్టీ పూర్తి విశ్వాసంతో, పూర్తి సన్నద్ధతతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ ఎన్నికలో బీజేపీ పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తున్నది. మూడోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ గెలవకుండా చేయాలనీ అమిత్ షా, మోదీ పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd kota batam. But іѕ іt juѕt an асt ?. India vs west indies 2023 archives | swiftsportx.