టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్, తెలుగులో చేసిన కొన్ని సినిమాలతోనే అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకుంది.”సీతారామం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే ఇమేజ్‌ను సెట్ చేసుకుంది. ఆ తర్వాత “హాయ్ నాన్న” సినిమాతో మరో హిట్ అందుకుంది. విజయ్ దేవరకొండ సరసన”ఫ్యామిలీ స్టార్” సినిమాలో నటించినా, ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఆ తర్వాత మృణాల్ బోలెడంత సమయం బాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది. తెలుగు సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ,తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ఒక పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.”అవును వదిలేస్తాను.కానీ మనస్పూర్తిగా ప్రేమించాను” అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అయితే, ఇది పర్సనల్ లైఫ్ గురించి కాకుండా, తన కొత్త సినిమాను గురించి ఎడిట్ చేసింది.”ఫ్యామిలీ స్టార్” సినిమాకి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సైలెంట్‌గా ఉన్న శ్రుతి హాసన్, ఇప్పుడు తన తాజా ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
హీరో అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన “డెకాయిట్” అనే సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి,కాగా సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే, శ్రుతి హాసన్ ఈ చిత్రంలో ఇతర కారణాల వల్ల తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా, ఆ రూమర్స్‌పై క్లారిటీ వచ్చింది. శ్రుతి హాసన్ ఈ చిత్రాన్ని వీడిన తర్వాత, ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించబోతుంది.మృణాల్ ఇటీవల అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా “డెకాయిట్” సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో “అవును వదిలేస్తాను, కానీ మనస్పూర్తిగా ప్రేమించాను”అని రాసింది.దీనికి స్పందనగా, అడివి శేష్ మరో పోస్టర్ విడుదల చేస్తూ, “అవును ప్రేమించావు. కానీ మోసం చేసావు.ఇడిచిపెట్టను.తేల్చాల్సిందే” అని రాసుకొచ్చాడు. ఈ రెండు పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.