WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వెళ్లింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం సభలో ప్రశేపెట్టింది.

ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మేఘ్వాల్‌ కోరారు.
15 పార్టీల వ్యతిరేకత
ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీ తరఫున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్‌ సాయంత్రానికి ప్రకటించనున్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి కమిటీ చైర్మన్‌ ఉండనున్నారు. కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఇవాళే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్‌ కోరనున్నారు. ప్రాథమికంగా ఈ కమిటీ కాలపరిమితి 90 రోజులు విధించనున్నారు. కాగా, జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ప్రకటించింది.
గతంలో జరిగిన జమిలి ఎన్నికలు
వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. గతంలో 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. . దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
పెద్దఎత్తున చర్చలు
అసలు జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్‌ తేదీగా లోక్‌సభ తొలిసారి సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ లెక్కన ఈ లోక్‌సభ తొలి సమావేశం గత జూన్‌ 24న జరిగింది. అంటే లోక్‌సభ కాలపరిమితి తీరిపోయే నాటికి అంటే జూన్‌ 24, 2029లోపు జమిలి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని విశ్లేషిస్తే, 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సిద్ధంగా లేని మోదీ
ఎన్డీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలు 2029లోనే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అలాగే, తన పూర్తి పదవీకాలాన్ని వదులుకోవడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని, ఈ క్రమంలో 2029లోనే జమిలి ఎన్నికలు ఉండొచ్చని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Asn kemenkumham penugasan bp batam ikuti pembinaan. Com – gaza news. Latest sport news.