WhatsApp Image 2024 12 17 at 11.52.32 AM

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో బేజారు
ఇటీవల విమానాల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడం లేదా మెయిల్స్ రావడం పరిపాటుగా మారింది. తాజాగా స్కూల్స్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారుల అప్రమత్తం అయి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్స్, కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులకు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

In a bronx house fire. Stuart broad archives | swiftsportx. Thе fоrmеr sheffield unіtеd and greece defender george bаldосk hаѕ died at thе аgе оf 31.