nagachaitnya shobitha

చైతు – శోభిత ల స్నేహం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలుసా..?

నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహం రీసెంట్ గా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో వారు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శోభిత ధూళిపాళ్ల తన అనుభవాన్ని పంచుకుంటూ.. “2018లో తొలిసారి నాగార్జున గారింటికి వెళ్లినప్పుడు చైతూను కలిశాను. 2022లో నాగచైతన్యతో స్నేహం మొదలైంది. ఫుడ్ విషయంలో ఇద్దరం ప్రత్యేకమైన అభిప్రాయాలను పంచుకునేవారమని, ఫుడ్ గురించి తమ ఇద్దరి మధ్య తరచూ చర్చలు జరిగేవని, ఇది వారి సంబంధాన్ని మరింత బలపరచింది అని పేర్కొంది. శోభిత మరియు నాగచైతన్య మొదటి సారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నామని , అప్పుడు నేను ముంబైలో ఉండగా, చైతూ హైదరాబాద్ లో ఉండేవాడు, తన కోసం చైతన్య ముంబైకి వచ్చి వెళ్లిపోతూ ఉండేవారి పేర్కొంది.

నాగచైతన్య ఈ సందర్భంలో శోభితను తరచూ “తెలుగులో మాట్లాడవా?” అని అడిగేవాడినని ..తెలుగులో మాట్లాడటం మా బంధాన్ని మరింత బలపరచింది” అని నాగచైతన్య అన్నారు. ఇండస్ట్రీలో వివిధ భాషలలో మాట్లాడే వ్యక్తులను కలుస్తూ ఉంటాం. కానీ తెలుగులో మాట్లాడేవారిని చూడటం నాకు ముచ్చటగా ఉంటుంది” అని నాగచైతన్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A double fatality in tryall,st. Latest sport news. But іѕ іt juѕt an асt ?.