పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం సౌత్ గ్రామంలోని రాజుల పాలెం ప్రాంతంలో 102 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల ఈ ఆలయానికి ఎదురుగా నివసించే చెరుకూరి ప్రసాదరాజు పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థుల ప్రకారం, ప్రసాదరాజు భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, హిందూ మతాన్ని అవమానించే చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సత్తెమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తుల పట్ల అనేకమార్లు దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. పూజలకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన కొనసాగుతుండటంతో, గ్రామ పెద్దలు ఈ వ్యవహారంపై పలుమార్లు స్పందించినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించలేదు. ప్రసాదరాజు గుడి ప్రభుత్వ స్థలంలో ఉందని, ఆలయ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ గ్రామస్థుల మాటల్లో, ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ఆలయానికి సంబంధించిన పంచాయతీ తీర్మానాలు మరియు పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
భక్తుల అభిప్రాయం ప్రకారం, ప్రసాదరాజు హిందూ దేవాలయం పేరును దుర్వినియోగం చేస్తూ స్వలాభం కోసం వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ వివాదం నేపథ్యంలో, గ్రామస్తులందరూ ఒక్కటై ప్రసాదరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నరసాపురం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆదివారం ఈ వ్యవహారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమవేశంలో ప్రసాదరాజు తక్షణమే తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, హిందూ మత భక్తులకు మరియు సత్తెమ్మ తల్లి ఆలయానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రామస్థులు స్పష్టం చేశారు, చర్యలు తప్పవు.” ఈ హెచ్చరికతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు భారీగా మొహరించి పరిస్థితిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.రెవెన్యూ అధికారులు ఆలయ స్థలంపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు.రెవెన్యూ అధికారులు ఆలయ స్థలంపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఆధారాలు పరిశీలించి వివాదం ముగించాలనే ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారు.